శనివారం పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ కొండవీడును సందర్శించి, తుపాను కారణంగా ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియల తొలగింపు పనులను పరిశీలించారు. కొండలపై నుంచి ఊటనీటితో బండరాళ్లు జారే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. ముందస్తు చర్యగా ఆది, సోమవారాల్లో ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు, అప్పటి వరకు పర్యాటకులు కొండవీడు సందర్శనకు రావద్దని ఆమె కోరారు.