మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 లక్షలు మంజూరు చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫిబ్రవరి 4న బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.