గురువారం కర్నూలు–గుంటూరు హైవేపై నరసరావుపేట వద్ద లారీ రోడ్డు పక్కనున్న మెకానిక్ షెడ్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. డ్రైవర్‌కు నిద్రమత్తు రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికుడు షెడ్ బయట ఉండటంతో ప్రాణనష్టం తప్పింది.