నరసరావుపేట సహాయక కార్మిక శాఖ కమిషనర్ గా షేక్ మహబూబ్ సుభాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కార్యాలయం సిబ్బంది విడుదల చేసిన ప్రకటనలో నెల్లూరులో విధులు నిర్వహిస్తున్న మహబూబ్ సుభాని డిప్యూటేషన్ పై నరసరావుపేట కార్మిక శాఖ సహాయక కమిషనర్ గా బదిలీపై వచ్చినట్లు పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుభానికి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.