నరసరావుపేటలో భారీ చోరీ: కోటి విలువైన బంగారం అపహరణ

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు శ్రీశైలం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి, ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో పాటు సుమారు కోటి రూపాయల విలువైన బంగారం చోరీకి గురైనట్లు ఆరోపించారు. ఈ ఘటనపై నరసరావుపేట 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్