రొంపిచర్లలో అర్ధరాత్రి భారీ చోరీ. 4 లక్షల విలువైన బంగారం, చోరీ

రొంపిచర్ల గ్రామంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. నరసరావుపేట రహదారిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో సుమారు రూ. 4 లక్షల విలువైన బంగారం, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు విజయకుమార్ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మండలంలో వరుస చోరీ ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతుండగా, దోషులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్