నరసరావుపేటలో 29న మెగా జాబ్ మేళా

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ & ఎన్ కళాశాలలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–35 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చని, ఎంపికైన వారికి రూ. 15, 000 నుంచి రూ. 1. 5 లక్షల వరకు వేతనం లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం https://tinyurl.com/nrtjobmela, https://naipunyam.ap.gov.in లింకులను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్