ఈపూరులో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పశుసంపద అభివృద్ధి ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరం రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్