నరసరావుపేట ప్రాజెక్టు పరిధిలోని ప్రకాష్ నగర్ సెక్టార్ లో, సెక్టార్ సూపర్వైజర్ జోజమ్మ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ.సి.డి.పి.ఓ. మాణిక్యరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ.సి.డి.పి.ఓ. మాణిక్యరావు మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తుందని, బిడ్డకు ఆరు నెలల వరకు నీరు, తేనె, ద్రవ పదార్థాలు పెట్టకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలియజేశారు.