నరసరావుపేట: రైలుపట్టాలపై మృతదేహం కలకలం

నరసరావుపేట ఏ1 ఫంక్షన్ హాలుకు సమీపంలోని రైలుపట్టాలపై మంగళవారం ఓ యాచకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు రైల్వే పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, అతని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్