నరసరావుపేట పట్టణం చిలకలూరిపేట రోడ్డులోని టీక్కో హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల్లో మురికి నీరు కాలనీలోకి ప్రవహించి చెరువుల కాసరగా మారుతోంది. రోడ్లు, కాలువలు, మంచినీటి సరఫరా, వీధి దీపాల లేమి సమస్యలు పెంచుతోంది. గురువారం పిడిఎం, తదితర ప్రజాసంఘాల నేతలు కాలనీని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.