బెంగళూరుకు చెందిన తండ్రీకుమారులు వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులైన బాదం మాధవరెడ్డి, గడ్డం రఘురామిరెడ్డి తదితర ఐదుగురిని అరెస్టు చేసిన నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు బుధవారం న్యాయమూర్తి ఎ. సలోమి ఎదుట హాజరుపర్చారు. కోర్టు వారికి ఆగస్టు 12 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటివరకు 13 మందిని ఈ కేసులో నిందితులుగా గుర్తించారు.