నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం రొంపిచర్ల గ్రామం నందు శ్రీ ప్రసన్నాంజనేయ గ్రూప్ సభ్యులకు అగ్రి కిసాన్ డ్రోన్ స్పెయర్ లను నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు అందించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార మిషన్ ద్వారా కంది మినుముల విత్తనాల మినీ కిట్లను అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని అన్నారు.