పల్నాడు జిల్లాలోని ప్రతి అధికారి ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి అర్హత కలిగిన 'బంగారు కుటుంబాలను' దత్తత తీసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.