నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం గంజా మత్తు పదార్థాలు అరికట్టడానికి ఈ తనిఖీలు చేపట్టామని వన్ టౌన్ ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించాలంటే వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో వన్ టౌన్ ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.