నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్టీయూ కళాశాలలో అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఆర్డీఓ మధు లత హాజరయ్యారు. కళాశాల పరిసరాలను పరిశీలించి, అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం కాకానిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.