జులై 12 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా నరసరావుపేట పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిచేయి చూపెడుతోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.