నూజెండ్ల: ప్రభుత్వ అధ్వర్యంలో అందరికీ ఇళ్లు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అందరికీ గృహాలు కార్యక్రమం వినియోగించుకోవాలని నూజెండ్ల తహశీల్దార్ రమేష్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఇల్లు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. మండల పరిధిలోని నిరుపేదలు అందరూ తమ పరిధిలోని గ్రామ సచివాలయంలో ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్