నరసరావుపేట రావిపాడు రోడ్డులో కొండపల్లి హాస్పటల్ సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రోసూరు మండలం ముక్కరాల కోటేశ్వరరావు (65) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన కలకలం రేపింది.