నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చుట్టు శిరీష(29)ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శిరీష భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.