పమిడిపాడులో పోలీసుల కార్డెన్ సెర్చ్

నరసరావుపేట మండలం పమిడిపాడులో శనివారం పోలీసులు డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని, వీధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని వాహనాలను, అనుమానాస్పద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్