నరసరావుపేట పట్టణానికి చెందిన నాగభూషణం చీమలమర్రి గ్రామంలో ఒక శుభకార్యానికి హాజరై, బంగారు నగలతో ఆటోలో నరసరావుపేట వస్తున్నారు. నరసరావుపేట చేరుకున్నాక, ఆటో దిగే సమయంలో ఫోన్ మాట్లాడుతూ తన బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయారు. బాధితురాలు విషయాన్ని గమనించి వెంటనే నరసరావుపేట టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి, ఆటో డ్రైవర్‌ను గుర్తించి, బాధితురాలికి ఆమె నగలను అందజేశారు.