గాలివానకు తెగిన విద్యుత్ తీగలు.. స్థానికుల్లో ఆందోళన

నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్ 60 అడుగుల రోడ్డులో గురువారం గాలివాన కారణంగా విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడిపోయాయి. దీనితో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదకర పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ తీగలను తొలగించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్