జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం 5 సంవత్సరాలు లోపు పిల్లలకు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తారు. బూత్‌లకు రాని పిల్లలకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి టీకా అందిస్తారు. పొరుగు దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వలస కూలీలు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి వ్యాధిని నివారించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్