కర్లకుంట ఫారంలో పందెం కోళ్లు చోరీ

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో రూ. 8 లక్షల విలువైన పందెం కోళ్లు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4, 19, 27 తేదీల్లో మూడు దఫాలుగా గుర్తుతెలియని వ్యక్తులు కోళ్లను అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కొందరు అనుమానితుల పేర్లను కూడా అందజేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్