కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై సహచర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బుధవారం సమీక్షించారు. వేలాది మంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.