రొంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో నక్క సుందర్రావు మరియు అతని అనుచరులు నక్క థామస్, స్టీవెన్, దాసుల పొలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చెట్లు కోసి దౌర్జన్యం చేశారు. శుక్రవారం సాయంత్రం సుందర్రావు గొడ్డలితో దాడికి కూడా పాల్పడ్డాడు. బాధితులు 100 నంబర్‌కు సమాచారం ఇచ్చినా, పోలీసులు సంఘటన స్థలానికి రాలేదని తెలిపారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ స్పందించారు. అయినా దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు న్యాయం కోరుతున్నారు.