ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఎండల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే మధ్యాహ్న సమయంలో బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.