రొంపిచర్లలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

రొంపిచర్ల మండలం రాజుల బజార్లో మంగళవారం సాయంత్రం విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా జార్ఖండ్‌కు చెందిన గోనె గోపి (21) విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఇన్వర్టర్ నుంచి రివర్స్ కరెంట్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అతడిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్