బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో ఓ వ్యక్తి క్షణికావేశంలో భార్యను కత్తితో హత్య చేసి, 48 గంటలకే అదే ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు (42)కు కృష్ణకుమారి (39)తో 20 ఏళ్ల క్రితం పెళ్లైంది. అనుమానంతో భార్యను పొలంలో చంపాడు. దీంతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.