పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసిపి పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గోర, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ప్రతిమకు నివాళులర్పించారు. దివ్యాంగుల సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పులిపాటి దుర్గారెడ్డి, ఆవుల నాగేంద్రం, షేక్ మాబు, కొనతం చంద్ పాల్గొన్నారు.