పర్చూరు వాసికి రాష్ట్ర విత్తన సంస్థలో పదవి

ఆంధ్రప్రదేశ్ సీసీ కార్పొరేషన్ వెరిఫికేషన్ సర్టిఫైడ్ సీస్ కమిటీలో పర్చూరు నియోజకవర్గానికి చెందిన మాలింపాటి సత్యనారాయణకు పదవి లభించింది. కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన సత్యనారాయణ, టిడిపి పార్టీ అభివృద్ధిలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు సహకారంతో రైతులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రస్థాయి విత్తన అభివృద్ధి సంస్థ ధ్రువీకరణ కార్యవర్గంలో ఈ అరుదైన పదవి లభించడం పట్ల నియోజకవర్గ టిడిపి నాయకులు, స్వగ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్