పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు ఎన్.ఆర్ అండ్ వి ఎస్ ఆర్ గర్ల్స్ హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాఠశాల ప్రారంభించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 40 ఏళ్ల క్రితం చదివిన విద్యార్థులు, గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు విశ్రాంత ఉపాధ్యాయుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.