బాపట్లలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు, మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. సోమవారం బాపట్లలో సమ్మె శిబిరం వద్దకు చేరి వారితో కలిసి మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు కార్మికులు ఉన్నారు.