ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా, ఇంకొల్లు మండలంలోని ఇంకొల్లు-3 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాధాన్యతపై తల్లులు, కిషోరి బాలికలు, కుటుంబ సభ్యులకు వివరాలు ఇచ్చారు. శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు కీలకమని, పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగించడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుందని పేర్కొన్నారు.