సముద్ర స్నానానికి వచ్చి నలుగురు విద్యార్థులు గల్లంతు

బాపట్ల జిల్లా చినగంజాం మండలం, పలెపాలెం సముద్ర తీరంలో గురువారం నలుగురు విద్యార్థులు సముద్ర స్నానానికి వచ్చి గల్లంతయ్యారు. ఇంకొల్లు మండలం, దుద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్న వీరిలో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన చందలూరి శ్రీరామ్, బిక్కి అవినాష్ ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాటిపర్తి హేమంత్ సాయి, గుంజి హేమవర్ధన్ సురక్షితంగా బయటపడ్డారు. శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు సముద్రానికి విహారయాత్రకు వచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్