బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలోని ఎం.పీ. యూపీ పాఠశాల, ఎం.పీ.పీఎస్ (ఎల్.ఇ) పాఠశాలలను సమగ్ర శిక్ష జిల్లా ఏ.ఎల్.ఎస్ కోఆర్డినేటర్ వి. సత్యసాగర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నో బ్యాగ్ డే, జిఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల పురోగతి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, రవాణా భత్యం ప్రతిపాదనలు, జాదూ పిటారా కిట్ల వినియోగం వంటి అంశాలపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని, భోజన నాణ్యతను అభినందించారు.