తిమ్మసముద్రంలో గోరంట్ల పున్నమ్మ సత్రం వర్ధంతి ఘనంగా నిర్వహణ

నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో బుధవారం గోరంట్ల పున్నమ్మ సత్రం ధర్మకర్త గోరంట్ల పున్నమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. విద్యాదాత గోరంట్ల వెంకన్న తన తల్లి జ్ఞాపకార్థం 1937లో వృద్ధులు, వికలాంగుల సౌకర్యం కోసం ఈ సత్రాన్ని ఏర్పాటు చేసి, నిర్వహణకు భూమి కూడా కేటాయించారు. అప్పటినుంచి ప్రతి ఏటా ట్రస్ట్ నిర్వాహకులు, ఎండోమెంట్ కార్యనిర్వాహక అధికారుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా పున్నమ్మ చిత్రపటానికి ట్రస్ట్ చైర్మన్ దరిద్రం రాంబాబు, ఈవో మోహన్ రావు నివాళులర్పించారు. గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల విద్యార్థులు చిత్రపటంతో గ్రామోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్