మన ఊరు బాగుంటేనే.. మన ఆరోగ్యం బాగుంటుంది

స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పర్చూరు నియోజకవర్గంలోని ఉప్పుటూరు గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పర్యావరణ హితమే మనకు రక్ష అని, సమాజంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పారిశుధ్యంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్