ఇంకొల్లు: అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం ఇంకొల్లు మండలం గొల్లపాలెం గ్రామంలో సుమారు రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ పనులు మంజూరయ్యాయని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు ప్రజల నిత్య జీవితానికి ఎంతో అవసరమని, గొల్లపాలెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్