కారంచేడు: పల్లె నిద్రలో పాల్గొన్న ఎస్సై

కారంచేడు మండలం ఎర్రంవారి పాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ బాషా పాల్గొని గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్సై వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్