యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన బొబ్బేపల్లి శ్రీనివాసరావు (52) సుమారు 20 లక్షల రూపాయల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భార్య సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రత్నకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.