మార్టూరు మండలం రాజుగారి పాలెం గ్రామంలో బుధవారం రాత్రి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను వారికి అందించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని 70 శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎమ్మెల్యే చెప్పారు.