గురువారం మార్టూరు క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే తన లక్ష్యమని, ప్రజలందరూ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.