చిన్నారుల నృత్యాలతో అలరించిన పాఠశాల వార్షికోత్సవం

మండల కేంద్రమైన ఇంకొల్లులో ఎం.ఆర్.ఆర్. లిటిల్ ఏంజిల్స్ ప్రైమరీ స్కూల్ మొదటి వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన పలు నృత్యాలు సందర్శకులను అలరించాయి. డైరెక్టర్ చిలుకూరి శ్రీధర్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే మెరుగైన విద్య, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు అలవర్చడం వల్ల పిల్లల జ్ఞానం, ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్