నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యాన్ని సోమవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన డీలర్ అంజిరెడ్డి కార్డుదారులకు ఇవ్వకుండా అక్రమంగా నిల్వచేసి ఉంచుతున్నారని జాయింట్ కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకుని వెళ్లారు. జేసీ ఆదేశాల మేరకు నాదెండ్ల పోలీసులు వీఆర్వో అధికారులు తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు.