పర్చూరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 24 దేవాలయాల నిర్మాణానికి సుమారు రూ. 4.30 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. నిధులు విడుదల కావడంతో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.