ప్రజల సానుకూల అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 20 ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలో పర్చూరు సీహెచ్‌సీ స్థానం పొందింది. బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య తెలిపారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమష్టి కృషి మరియు నాణ్యమైన వైద్య సేవల ఫలితంగానే ఈ గౌరవం లభించిందని ఆమె పేర్కొన్నారు. డైరెక్టర్ మామిడిపాక హరి ప్రసాదరావు వైద్య సిబ్బందిని సత్కరించి అభినందనలు తెలిపారు.