పర్చూరు మండలంలోని నూతలపాడులో ఉన్న ఆశ్రయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యవసర వస్తువులు సోమవారం పంపిణీ చేశారు. ఈ నిత్యవసర వస్తువులను కువైట్ లో ఉంటున్న ప్రవాస ఆంధ్రుల తరపున స్వచ్ఛంద సంస్థ అందించినట్లు విశ్రాంతి ఉపాధ్యాయుడు బి. కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, జయలక్ష్మి వృద్ధులు పాల్గొన్నారు.