ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలని, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. అంబటి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏలూరి డిమాండ్ చేశారు.